_కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో మూడు రాజ గోపురాల నిర్మాణం
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
రుద్రారం శ్రీ సిద్ది గణపతి దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఒక కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో మూడు రాజగోపురాల నిర్మాణ పనులకు సోమవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రాశస్త్యం పొందిన సిద్ధి గణపతి దేవాలయాన్ని అంచలంచలుగా అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 50 లక్షల రూపాయల సొంత నిధులను అయ్యప్ప, శివ, ఆంజనేయ స్వామి భక్తుల కోసం ధ్యాన మందిర నిర్మాణ పనులకు కేటాయించామని తెలిపారు.రోజురోజుకీ ఆలయాన్ని దర్శించే వారి భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని పురాతన ఆలయాలను జీర్ణోధారణ చేయడంతో పాటు, నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ రాజు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, రాజు, పార్టీ మండల అధ్యక్షులు పాండు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈవో మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…