సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,శాండ్విక్ యూనియన్
అధ్యక్షులు చుక్క రాములు
-40 సంవత్సరాల పాటుగా ఒకే నాయకత్వంలో ఎవరికి సాధ్యం కానీ చారిత్రాత్మక విజయాలు
– కార్మికుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటం
– శాండ్విక్ 40 వ వార్షికోత్సవం పురస్కరించుకొని వాలీబాల్ పోటీలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతిరోజు శ్రమించే చేతులు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రమజీవులలో మానసిక ఉల్లాసం కలిగిస్తాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,ఎస్ఈయు అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. పటాన్ చెరుపారిశ్రామిక ప్రాంతంలో గల శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయు అనుబంధంగా ఐక్యంగా ఓకే నాయకత్వంలో 40 సంవత్సరాలు(1985-2025) పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 40 వ వార్షికోత్సవము కార్యక్రమాలలో భాగంగా ఆదివారం మండలంలోని పోచారం గ్రామ పరిధిలో గల స్విచ్ స్పోర్ట్స్ స్టేషన్ మైదానం లో కార్మికులకు నిర్వహించిన వాలీబాల్ పోటీలకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు ముఖ్య అతిధిగా హాజరై టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పరిశ్రమలో 40 సంవత్సరాలపాటు ఒకే నాయకత్వంలో కార్మికులను ఐక్యంగా నిలబెట్టి ఇతరులకు సాధ్యం కాని అనేక అద్భుత విజయాలు సాధించడం అనేది చారిత్రాత్మకమన్నారు. కార్మిక సంక్షేమం కోసం రాజీలేని పోరాటం, పరిశ్రమలో నూతన కార్మికులు రావడానికి యూనియన్ నాయకత్వం ఎప్పటికప్పుడు తీసుకున్న ఎత్తుగడల ద్వారా మరియు పటిష్ఠమైన కారకర్తలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమైందని చెప్పారు. కొందరు స్వార్ధపరులు ఎన్ని అవాంతరాలు సృష్టించినా చైతన్యం గల శాండ్విక్ కార్మికులు వాటిని అధిగమిస్తున్నారని అన్నారు. 40 వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకొని స్వర్ణోత్సవాల వైపుకి మన ప్రయాణం సాగాలని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. వాలీబాల్ పోటీలలో పాల్గొంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి. పాండురంగా రెడ్డి, ఎమ్.మనోహర్, ఎ. వీరారావు, హెచ్. వెంకట్రావు, వి. సదాశివరెడ్డి, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
పటాన్‌చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…
ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయి…
గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు పటాన్‌చెరు…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) బాంబే సహకారంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…