మనవార్తలు ,పటాన్ చెరు:
కేరళ రాష్ట్రంలోని కోల్లం (జిల్లా), చెడాయ మంగళం, గ్రామంలోని శ్రీరాముడి ఆలయంలో 1000 అడుగుల ఎత్తున ఉన్న రాతికొండకు మెట్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో విరాళాలు సేకరిస్తున్న మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ కు పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ తన కార్యాలయానికి విచ్చేసిన కుమ్మనమ్ రాజశేఖరన్ ను స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం కేరళ రాష్ట్రంలోని కోల్లం శ్రీరాముడి ఆలయంలో 1000 అడుగుల ఎత్తున ఉన్న రాతికొండకు మెట్లు ఏర్పాటు చేస్తున్న ఆలయానికి తనవంతు సాయంగా జాటయుపర శ్రీ కోదండరామ క్షేత్ర ట్రస్ట్” వారికి తన వంతుగా యాభై ఐదు వేల రూపాయల చేక్ ను అందజేశారు. ఆ ప్రదేశంలో శ్రీరాముడి పాదముద్ర ఉండడం విశేషంమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ గౌడ్, పటాన్చెరువు మండల బిజెపి అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య , బిజెపి సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి , ఇస్నాపూర్ వార్డు సభ్యులు నారాయణదాసు, మరియు ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…