Telangana

ప్రతి కార్మికుడికి పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అగర్వాల్ రబ్బర్ కార్మికుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం 

అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ గేట్ వద్ద బిఆర్టియు జెండా ఆవిష్కరణ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

పటాన్‌చెరు పరిధిలోని అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు.. వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు, అగర్వాల్ రబ్బర్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ ఎదుట ఏర్పాటు చేసిన బిఆర్టియు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి   ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం పరిశ్రమ ఎండి అమిత్ అగర్వాల్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలపై చర్చించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మిక నేపథ్యం నుండి రాజకీయాల్లోకి వచ్చిన తనకు ప్రతి కార్మికుడి కష్ట నష్టాలు తనకు తెలుసునని అన్నారు. అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి చట్టపరంగా రావలసిన అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు  ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు సైతం అందిస్తామని తెలిపారు. పరిశ్రమ అభివృద్ధిలోనూ కార్మికులు కీలక పాత్ర పోషించాలని కోరారు. విధి నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తిన  తన దృష్టికి తీసుకొని రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బిఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి, అగర్వాల్ రబ్బర్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి యాదవ్, రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కార్మిక నాయకులు మధుసూదన్ రావు, అశోక్ రాజ్, సత్తయ్య, ఏడుకొండలు, ధర్మ రావు, కమృద్దీన్, విజయ్ కుమార్, పాణిగ్రాహి, రాజు, సింగ్, నరసింహ, శివ కుమార్, రవి, బాల రాజేష్, మల్లేష్, పాండా, రాజేంద్ర, నాగరాజు, సాహు, సంజీవ్, రమణ, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో 9వ మెగా మెడికల్ క్యాంప్

400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్న మియాపూర్ యువ నాయకుడు…

20 hours ago

ఘనంగా ఐఐటి చుక్కారామయ్య 101 వ పుట్టినరోజు వేడుకలు

ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు పటాన్‌చెరు, మనవార్తలు…

20 hours ago

క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ  పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల…

1 day ago

బీరంగూడ అయ్యప్పస్వామి దేవాలయానికి ఎమ్మెల్యే జిఎంఆర్ భారీ విరాళం

10 లక్షల రూపాయల విరాళం అందజేత భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక…

1 day ago

క్వాంటం టెక్నాలజీపై అధ్యాపక వికాస కార్యక్రమం

భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, క్వాంటం మిషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: అభివృద్ధి…

1 day ago

సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద…

2 days ago