_సామాజిక సేవలో పారగాన్ సంస్థ సేవలు అభినందనీయం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
సామాజిక సేవలో పారగాన్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ మార్క్స్ నగర్ లో పారగాన్ సంస్థ సౌజన్యంతో 83 లక్షల రూపాయల సి.ఎస్.ఆర్ నిధులతో చేపడుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రం నూతన భవనాల నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే జీఎంఆర్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ లు కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమలు సామాజిక బాధ్యతా కార్యక్రమం ద్వారా అందిస్తున్న నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.పారగాన్ సంస్థ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా ఇప్పటికే రామచంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పటాన్చెరులోని ఏరియా ఆసుపత్రిలో లక్షల రూపాయల వ్యయంతో అధునాతన శస్త్ర చికిత్స పరికరాలను అందించిందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తితో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు.ఆధునిక వసతులతో పాఠశాల భవనంతో పాటు అంగన్వాడి కేంద్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు..ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మండల విద్యాధికారి జెమినీ కుమారి, పారగాన్ సంస్థ ప్లాంట్ మేనేజర్ శ్రీ జిత్, సీనియర్ హెచ్ఆర్ బిన్ను, బి ఆర్ ఎస్ పార్టీ ఏరియా అధ్యక్షులు గోపాల్, నాయకులు సురెష్ రెడ్డి , ఖలీమ్ , బాగయ్య, చంద్ర శేఖర్, సుశీలమ్మ, చంద్రమ్మ, ధనరాజ్ గౌడ్, పద్మ , రజని , గోరి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…