Telangana

జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో 3 కోట్ల 46 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

_సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్ధశ

_ఇంద్రేశం అభివృద్ధికి జివిఆర్ ఎంటర్ప్రైజెస్ చేయూత

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్దశ చేకూరిందని అన్నారు.పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలోని పిఎన్ఆర్ టౌన్షిప్ లో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సహకారంతో ఒక కోటి 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్కే వన్ కాలనీలో రెండు కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ఏర్పడక ముందు జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలు గమనించాలని కోరారు. గర్భిణీ స్త్రీ నుండి పండు ముదుసలి సరి వరకు ప్రతి ఒక్కరికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు, దళిత బంధువు బీసీ బందు మైనార్టీ బందు పథకాల ద్వారా ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలగా.. పది ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రతి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెంప చెల్లుమనేలా ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

 

ఐనోలు గ్రామంలో ఘనంగా చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ

పటాన్చెరు మండల పరిధిలోని ఐనోలు గ్రామ చౌరస్తాలో సొంత నిధులతో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గురువారం రాత్రి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాల్లోఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సర్పంచులు నరసింహ, పద్మా వెంకటేష్, ఎంపీటీసీ మానెమ్మ, ఉప సర్పంచ్ శివ గౌడ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, బండి శంకర్, శివారెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శంకర్ రెడ్డి, దుర్గారెడ్డి, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago