దేశంలోనే అత్యంత భారీ స్థాయిలో సూర్య దేవాలయం నిర్మాణం
ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి
ఛట్ పూజ ఉపవాస దీక్షల ముగింపు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఉత్తర భారతీయుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, గతంలో ఇచ్చిన హామీ మేరకు రెండు కోట్ల రూపాయల సొంత నిధులతో పటాన్చెరు సాకి చెరువు కట్టపైన అత్యంత సుందరంగా, అన్ని సౌకర్యాలతో సూర్య భగవాన్ దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఉత్తర భారతీయులు సూర్య భగవానుడిని ఆరాధిస్తూ నిర్వహించే చట్ పూజ ఉపవాస దీక్షల ముగింపు సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడి దేవాలయం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్చెరు ప్రాంతం నిలుస్తోందని తెలిపారు.. నియోజకవర్గంలో నివసిస్తున్న ఉత్తర భారతీయుల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో తగు ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ వారి అభివృద్ధికి అండగా నిలుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ కుమార్, గూడెం విక్రం రెడ్డి, పృథ్వి రాజ్, శ్రీధర్ చారి, సందీప్ శా, కిషన్, సంజయ్ సింగ్, ఉత్తర భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…