మనవార్తలు,పటాన్ చెరు:
ఎంత కాలం నిలువ ఉంచినా గంగా జలం పాడవదని , అలాగే మనదేశంపై ఎందరో దాడులు చేసి భౌతిక సంపదను తరలించుకుపోయినా మన ధర్మం , పెద్దలు ఇచ్చిన జ్ఞానం ఇప్పటికీ నిలిచే ఉన్నాయని స్వామి పరిపూర్ణానంద సరస్వతి అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని చరినైతి విద్యార్థి విభాగం అధ్వర్యంలో ‘ యువత పాత్ర , బాధ్యతలు ‘ అనే అంశంపై బుధవారం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు . మనపై మనకే అవగాహన ఉంటే ఇతరులెవరిపెట్టా ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టీకరించారు . ముందుగా ప్రతి ఒక్కరూ ధర్మాన్ని సరిగా అర్ధం చేసుకోవాలని , ధర్మం అంటే ఓ వ్యవస్థ అని , సమతౌల్యమని , సంతులనం చేసుకోవడమని అన్నారు . ఓ మనిషిగా , కొడుకుగా , విద్యార్థిగా లేదా ఉద్యోగిగా మన ధర్మం ఏమిటో ముందుగా గుర్తెరిగి , అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు .
ముందుగా మనకు నేర్చుకోవాలనే ఆకాంక్ష , ఆసక్తి ఉంటే ఈ సమాజం ఎంతో నేర్పుతుందన్నారు . ప్రకృతిని సరిగా అర్థం చేసుకుంటే అని మనకు సామరస్యాన్ని పంచుతుందని చెప్పారు . సమస్యలకు రాజీపడొద్దని , వాటిని అధిగమిస్తూ ఎదగడం నేర్చుకోవాలన్నారు . బుద్ధుడు దశావతారాల్లో ఒకరా అన్న ప్రశ్నకు బదులిస్తూ , సృష్టి పరిణామక్రమాన్ని వివరించారు . ఈ సృష్టిలో అంతా నీరేనని , భూమి కూడా నీళ్ళపెనే ఉందని , నీళ్ళలోనే తొలి జీవి పుట్టిందని , అదే తొలి మత్స్యావతారంగా ఆయన అభివర్ణించారు . ఆ తరువాత ఉభయచర జీవి ( భూమి – నీటిలో మనగలిగేది ) కూర్మావతారమని , భూమి మీదే మనగలిగిన వరాహ అవతారం , ఆ తరువాత సగం మనిషి – సగం జంతువు అని నారసింహావతారమని చెప్పారు . వామనావతారం పూర్తి మనిషే అయినా తగినంత పరిపక్వత లేదని , పరశురాముడి అవతారం ఒక గిరిజనుడి జీవన విధానాన్ని సూచిస్తుందని , ఆ తరువాత రాముడి అవతారం సమాజం , నియమాలు , విధానం , కలిసి మెలికి బతకడం వంటివి నేర్పించిందన్నారు .
బలరాముడి అవతారం కృషిని , కృష్ణుని అవతారం మాయ , మర్మం , ఏది చేయాలో , ఏది చేయకూడదో తెలియజేసిందని చెప్పారు . కృష్ణుడు బోధించిన భగవద్గీతను అర్థం చేసుకుంటే జీవితాన్నే తెలుసుకోవచ్చన్నారు . మనిషిలో పెరుగుతున్న స్వార్థమే కల్కి అవతారమని , కోవిడ్ మహమ్మారి తన , పర భేదం లేకుండా మనిషిలో ఉన్న స్వార్థాన్ని బట్టబయలు చేసిందని చెప్పారు . బుద్ధుడు గురువు అయినా దేవుడిగా చూడాలని మన పెద్దలు బోధించారన్నారు . ప్రతి సంప్రదాయం వెనుక ఓ శాస్త్రం ఉంటుందని , ఒక దీపం లక్షల దీపాలను వెలిగించగలదు కాని , ఒక విద్యుత్ దీపం మరో దీపాన్ని వెలిగించలేదని స్వామి పరిపూర్ణానంద చెప్పారు . దీపం మాదిరి మనం కూడా నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలని సూచించారు .
ఎప్పుడైనా కొంత ఖాళీ సమయం దొరికితే , ముందుగా మనని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు . తాను వ్యక్తిగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఓ వ్యవస్థగా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పారు . ముందుగా జ్ఞానాన్ని సమకూర్చుకోవాలని , ఎంత క్లిష్టమైన పనినైనా కొంచెం ఆలోచించి చేస్తే విజయవంతం కాగలనున్నారు . గెలవాలనే సంకల్పం బలంగా ఉంటే , దానిని ఎవరూ అడ్డుకోలేరని , మహా అయితే కొంచెం ఆలస్యం కావచ్చని , కానీ విఫలం కామని స్వామి పరిపూర్ణానంద స్పష్టీకరించారు . ఓ తొలుత గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ఎన్.సీతారామయ్య , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీని రామారావు తదితరులు స్వామీజీ సత్కరించారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…