Telangana

ఎస్‌ఐఆర్ అమలులో లోపాలు సరిదిద్దాలి బీజేపీ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు బలరాం

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :

కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్) కార్యక్రమం సమర్థవంతంగా అమలు కాకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు, శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం పేర్కొన్నారు.తన నివాసంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ,ఎన్యుమరేషన్ దరఖాస్తులను నింపడం లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రతి బూత్ పరిధిలో 2002 ఓటరు జాబితాలను పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలని సూచించారు. దీంతో ప్రజలు తమ వివరాలను సులభంగా పరిశీలించుకుని దరఖాస్తులను సక్రమంగా నింపుకునే అవకాశం ఉంటుందన్నారు.బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)తో పాటు మరో అధికారిని నియమించి, ఎస్‌ఐఆర్ దరఖాస్తులను ప్రభుత్వ సిబ్బందే నింపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ప్రజలు తెలిసీ తెలియక ఫారాల్లో పొరపాట్లు చేసే అవకాశం ఉందని, అలాంటి తప్పిదాల వల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల ప్రతి బూత్‌ లో అదనపు అధికారిని నియమించి, ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తులను స్వయంగా ప్రభుత్వ అధికారులు నింపే విధంగా చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని బలరాం విజ్ఞప్తి చేశారు. దీంతో ఓటర్లకు ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago