ముందే చెప్పాం.. అమలు చేశాం.. సాధించాం
మీ వెనుక నేనున్న.. అభివృద్ధిలో ముందుకు సాగండి
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి మెప్పు పొందండి
నూతన మున్సిపల్ పాలకవర్గాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ అభినందన సందేశం
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరవేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజు కానుకగా అందించామని ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని ఇందుకు సహకరించిన కార్యకర్తలకు సంపూర్ణ నమ్మకంతో ఆశీర్వదించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో ఇటీవల నూతనంగా ఎన్నికైన గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ వారిని ఘనంగా సన్మానించి అభినందించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు అత్యంత సహజమని ప్రజలు నమ్మకంతో గెలిపించిన ప్రజాప్రతినిధులందరూ ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి సంక్షేమాల అంశంలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. ఇందుకు తాను ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఐదు మున్సిపాలిటీల అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని అతి త్వరలో ఇందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేద్దామని తెలిపారు.ప్రతిపక్షంలో ఉన్నప్పటికిని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై పటాన్చెరు ప్రజలు ఎల్లప్పుడూ తమ నమ్మకాన్ని కొనసాగిస్తున్నారని ఇందులో భాగంగా ఐదు మున్సిపాలిటీలలోనూ. బిఆర్ఎస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లోను క్లీన్ స్వీప్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…