_క్రీడాకారులకు ఎల్లవేళలా సంపూర్ణ సహకారం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈనెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో జరగనున్న జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలకు హాజరవుతున్న తెలంగాణ జట్టుకు ఎమ్మెల్యే జిఎంఆర్ 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా మాస్టర్ అథ్లెటిక్స్ జట్టుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సంగారెడ్డి జిల్లా జట్టుతో పాటు తెలంగాణ రాష్ట్ర జట్లు మంచి ప్రతిభను కనబరుస్తున్నాయని అన్నారు. 40 సంవత్సరాల వయసు నుండి 90 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారులు వీటిలో పాల్గొంటారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇక్బాల్, కార్యదర్శి సామెల్, క్రీడాకారులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…