జడ్చర్లలో గరుడ వస్త్ర సిల్క్స్ ను ప్రారంభించిన సినీ నటి సుమ కనకాల

Districts Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి,జడ్చర్ల :

గరుడ వస్త్ర సిల్క్స్ తెలంగాణలో తమ తొలి బ్రాంచ్‌ను జడ్చర్లలోని నేతాజీ రోడ్డులో ప్రముఖ సినీ నటి సుమ కనకాల ప్రారంభించారు .అనంతరం సుమ కనకాల మాట్లాడుతూ జక్క శమంతకమణి, జక్క మనీషా, జక్క శ్రేయ మరియు అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థాపించబడిన గరుడ వస్త్ర సిల్క్స్, వినియోగదారులకు అత్యుత్తమమైన మరియు ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో సంప్రదాయ మరియు ఆధునిక ఫ్యాషన్ కలెక్షన్లను విస్తృతంగా అందిస్తోందని ఆమె అన్నారు జడ్చర్ల ప్రజలకు గరుడ వస్త్ర సిల్క్స్ ప్రారంభం ఒక శుభవార్త అని, కుటుంబ సమేతంగా కొత్త స్టోర్‌ను సందర్శించి ప్రత్యేక కలెక్షన్లను వీక్షిస్తూ ప్రారంభోత్సవ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆహ్వానించారు. గ్రాండ్ లాంచ్ సందర్భంగా అందమైన మరియు ప్రత్యేకమైన చీరల కలెక్షన్లతో పాటు, వివిధ సందర్భాలకు అనువైన ఎన్నో ప్రత్యేకమైన వస్త్రాల ఎంపికలు అందుబాటులో ఉండనున్నాయిని,ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రత్యేక ఆఫర్లు మరియు లాంచ్ ప్రమోషన్లు కూడా అందించనున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి డి.కె. అరుణ , ఎంపీ, శ్రీ జనపల్లి అనిరుధ్ రెడ్డి , మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి , మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ,శ్రీమతి జ్యోతి లాల్ రెడ్డి పాల్గొన్నారు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *