– సాంకేతిక-సాంస్కృతికోత్సవాలతో సందడిగా మారిన గీతం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రమాణ-2024 శుక్రవారం కనులు మిరిమిట్లు గొలిపిన ఆటో షోతో శ్రీకారం చుట్టుకుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో తాజా పురోగతులను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న విభిన్న నేపథ్యాల విద్యార్థులను ఆకర్షించింది. ఆడీ ఆర్ 8, బీఎండబ్ల్యూ, స్కోడా వంటి అత్యాధునిక, ఖరీదెన కార్లు, సీబీజెడ్, కవాసాకి వంటి బెక్టులు ప్రాంగణంలో సందడి చేశాయి. ప్రమాణ ఉత్సవాలలో భాగంగా రోజంతా వివిధ కార్యక్రమాలు, పోటీలు నిర్వహించారు. ఎంటర్ప్రైన్యూర్ వర్క్ షాప్ , నృత్య శిక్షణ కార్యశాల, ఆర్కిటెక్చర్ మోడళ్ల ప్రదర్శన, రా అండ్ రియల్ పేరిట డ్యాన్స్ పోటీలు, రోబో సాకర్, ఫోటోగ్రఫీ పోటీలలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఇవన్నీ ఆయా విద్యార్థుల నెపుణ్యాలు, సృ జనాత్మకత, ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వేదికగా తోడ్పడ్డాయి. దీనికితోడు వాయిద్య హోరు- కుర్రకారు హుషారు ప్రాంగణాన్ని సందడిగా మార్చింది. బృంద నృత్యాలు, పాటలు, కీబోర్డు, వివిధ రకాల వాద్యపరికరాలతో సాంస్కృతి కార్యక్రమాలు హోరెత్తాయి.
ర్యాంప్ వాక్ లో పాల్గొన్న వారి హొయలు, హావభావాలు, వేషధారణ, ఆత్మవిశ్వాసం వంటివి ఆహూతులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమలో నిబిడీకృతంగా ఉన్న నైపుణ్యాలు, ప్రతిభను ప్రదర్శించి, వేదిక పైన తమ అభినయాన్ని ఎటువంటి జంకు-గొంకు లేకుండా ప్రేక్షకుల ముందు ధైర్యంగా ప్రదర్శించి అలరించారు. ఈ ప్రదర్శనలు తోటి విద్యార్థుల కరతాళ ధ్వనులు, ప్రోత్సాహక నినాదాలతో మార్మోగాయి. కళాకారుల ప్రదర్శనలో భాగంగా, రామ్ మిరియాల, సాహితీ చాగంటి తమ తాజా సినీ పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. జంట నగరాల చుట్టుపక్కలున్న పలు కళాశాలల నుంచి వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు రెండవ రోజు ప్రమాణ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు అంశాలలో పోటీపడి తమ సామర్థ్యాన్ని పరీక్షించుకున్నారు. ప్రమాణ పేరిట నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల ఉత్సవాలు శనివారం సాయంత్రం భారత్ లోనే పేరొందిన ప్రముఖ డీజే ప్రాజెక్ట్ 91, స్కాట్లాండ్ నుంచి వస్తున్న ప్రపంచ ప్రసిద్ధ నినా సుర్దా నిర్వహించనున్న సంగీత హోరు (ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ నెట్ / డీజే)తో ముగియనున్నాయి.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…