Telangana

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం ‘ప్రమాణ 2026’ను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఈనెల 27, 28 తేదీలలో నిర్వహించనుంది. డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ మార్గదర్శనంలో స్టూడెంట్ ఆర్గనైజింగ్, లీడర్ షిప్ కమిటీ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది.ముందస్తు వేడుకలతో ఈ యేడాది ప్రమాణ ఆరంభమైంది. ఇందులో నృత్య, పాటల పోటీలు, ఆటో ఎక్స్ పో, ముఖాముఖి చర్చలను ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లు అన్నింటిలో హైదరాబాద్ ప్రాంగణ అధికార మస్కట్ రోరోను ప్రదర్శిస్తున్నారు.ఇక తొలిరోజు ప్రమాణ 2026 ఆటో ఎక్స్ పోతో శుభారంభం కానుంది. ది డెక్కన్ ప్రాజెక్ట్, ది హెడ్ లైనర్ బ్యాండ్, ప్రముఖ నేపథ్య గాయని గీతా మాధురి ప్రదర్శనతో పాటు DJ NANDZY యొక్క హై-ఎనర్జీ డీజే సెట్ వంటివి అలరించనున్నాయి. చివరి రోజు, ఈనెల 28న, కశ్యప్ ప్రదర్శనలు, డీజే స్వాట్రెక్స్ యొక్క అద్భుతమైన ఈడీఎం ప్రదర్శనను ప్రేక్షకులు వీక్షిస్తారు. వాటికి నృత్యం, సంగీతం, నాటకం, సాంస్కృతిక యుద్ధాలు వంటి ఉన్నత స్ఠాయి పోటీలు జతకలుస్తాయి. వీటికి అదనంగా, ‘మూడు రోజులు – మూడు అనుభూతులు’ పేరిట మోటార్ స్పోర్ట్స్, గ్లామ్ అండ్ గాలా, ప్రధాన పాత్ర వంటి ఇతివృత్తాలతో నిర్వహిస్తున్నారు.‘ప్రమాణ ఉత్సవం కంటే ఎక్కువ. ఇది ఆచరణతో కూడిన అనుభవపూర్వక అభ్యాసం. ప్రణాళిక, బడ్జెట్, అమలు, సమన్వయం, సమయ నిర్వహణ వంటి విద్యార్థుల భవిష్యత్తు కెరీర్ కు అవసరమైన అన్ని ప్రధాన జీవన నైపుణ్యాలను ఆచరణాత్మకంగా నేర్చుకుంటారు. మరీ ముఖ్యంగా, ఆనందాన్ని ఆస్వాదిస్తూ నేర్చుకోవడం ఈ వేడుక ప్రత్యేకత. బాధ్యత, వేడుకల సమతుల్యత ప్రమాణకు నిజమైన నిర్వచనం’ అని ప్రమాణ విస్తృత ప్రభావాన్ని క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ వివరించారు.మొత్తంమీద, ప్రతిభ, నాయకత్వం, అభ్యాసం వంటివి తరగతి గదికి మించి నేర్చుకునే శక్తివంతమైన వేదికగా ప్రమాణ 2026 నిలుస్తుంది.

admin

Recent Posts

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

4 hours ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

4 hours ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

1 day ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

1 day ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago