పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని బీఆర్ఎస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సాయంగా రెండు లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆధ్యాత్మిక వాతావరణంలో పల్లెలు ,పట్టణాలు అభివృద్ధి చెంది సుఖసంతోషాలతో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చుంచు రేణుక స్వామి,ఎంపీటీసీ పార్వతమ్మ,ఉప సర్పంచ్ తీగల సత్తయ్య, అశోక్, శివకుమార్, కనకరాజు,భాస్కర్ ,శ్రీకాంత్, సంతోష్,శేఖర్, గ్రామ పెద్దలు, ప్రజలు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సైతం దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో కేసీఆర్ ఆలయాల అభివృద్ధి పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…