మనవార్తలు ,అమీన్ పూర్
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో చేపడుతున్న పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం లో భాగంగా మంగళవారం మున్సిపల్ పరిధిలోని నవ్య నగర్ నుండి బీరంగూడ శివాలయం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీ ని స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం లో మొదటి స్థానం నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ప్రతి కాలనీ పరిధిలో అంతర్గత మురికినీటి కాలువల నిర్మించడంతో పాటు, బహిరంగంగా చెత్త వెయ్యకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…