రామేశ్వరంబండ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
అతి త్వరలో సొంత నిధులతో అంబేద్కర్ భవన నిర్మాణం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్‌చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి గొప్ప నాయకుడు డాక్టర్ అంబేద్కర్ అని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు, సమాన హక్కులు, పరిపాలన వికేంద్రీకరణ, చిన్న రాష్ట్రాలు, పరిపాలనలో మహిళలకు 50% రిజర్వేషన్లు, తదితర మహోన్నత నిర్ణయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు 20 లక్షల రూపాయల సొంత నిధులచే అంబేద్కర్ భవనం నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు.ఇటీవల తాను లండన్ వెళ్లినప్పుడు అంబేద్కర్ విద్యను అభ్యసించిన కళాశాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు పాటు పడాలని కోరారు. యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ధరణి అంతి రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, నగేష్, శంకర్, సురేష్, ఇబ్రహీం, అర్జున్, కిరణ్, రమేష్, దానయ్య, నవీన్, సర్దార్, సాయిలు, రాములు, లోకేష్, దశరథ్, యాదమ్మ, నగేష్, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…