Telangana

ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే

– కోకాపేటలో ముదిరాజ్ భవన్ ను నిర్మిస్తా

– ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :  

రాష్ట్ర ప్రభుత్వం నుండి ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే అందిస్తానని ముదిరాజ్ కార్పొరేటర్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ టివోలీ గార్డెన్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ కులస్తుల కోసం ముదిరాజ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందని ,మన ముదిరాజ్ లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఒక ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ ప్లాట్ ఫామ్ ను ప్రతి ముదిరాజ్ బిడ్డ వినియోగించుకొని ఆర్థికంగా,సామాజికంగా ఎదిగాలన్నారు.కోకాపేట లో 5 ఎకరాల స్థలం ఉందని ఆ స్థలంలో ముదిరాజ్ భవన్ ను కట్టిస్తానని ఆయన వెల్లడించారు.

పార్టీలకతీతంగా ముదిరాజ్ నాయకులంతా ఏకమై ముదిరాజు కులస్తులను ఆర్థికంగా ఎదిగే విధంగా సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ విషయంలో ముదిరాజ్ జర్నలిస్టులు సహకరించి రాష్ట్రంలో ఉన్న పేద ముదిరాజ్ బిడ్డలకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు.గత పాలకులు ముదిరాజ్ కులస్తులను విభజించి పాలించారని, అందుకే మనమంతా వెనుక పడ్డామన్నారు.అనంతరం జర్నలిస్టు సంఘం నాయకులు చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను ఘనంగా సన్మానించి సత్కరించారు.

ఈ సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం గౌరవ అధ్యక్షులు బలరాం,రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు చింతల నీలకంఠం,ప్రధాన కార్యదర్శి బోయిన శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల‌ శ్రీనివాస్, సాయన్న,రెడ్డబోయి‌న హరికుమార్, గోనెల కుమార్ గడ్డమీద శ్రీశైలం, ,ఇండస్ట్రీ అధ్యక్షుడు ప్రభాకర్,అడ్వకేట్ ముదిరాజ్ సంఘం వినోద్ కుమార్,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సుగ్రీవుడు,రాష్ట్రం ముదిరాజ్ జర్నలిస్టు సంఘం నాయకులు సతీష్, శివ, మల్లికార్జున్ ,భూమయ్య, శివన్న, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

14 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago