Telangana

కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం.. నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మత్స్యకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.గురువారం జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ సుంకరబోయిన మహేష్ గారి ఆధ్వర్యంలో మత్స్య సంఘం భవన ప్రారంభోత్సవం తో పాటు సత్యనారాయణ వ్రతం, కార్తీక మాస వన భోజనాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. మత్స్యకారుల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో చేపల పెంపకానికి చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిందని, మత్స్యకారుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్తీక మాసం సందర్భంగా శివ కేశవులని పూజిస్తూ ఏర్పాటు చేసిన వన బోజనాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వన బోజనాలు ఐక్యతను సూచించడంతో పాటు మనషుల మధ్య స్నేహభావం పెంపొదిస్తుందని తెలిపారు. మనం ఐకమత్యంగా ముందుకు కదిలితేనే సమాజంలో మన జాతికి గుర్తింపు లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిమామిడి రాజు, జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగు రమేష్,కాంగ్రెస్ నాయకులు ఎట్టయ్య, మండల అధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్, గారెల మల్లేష్, మాణిక్యరావ్, లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్,అశోక్,గణేష్,వీరేష్, పూజరి రాజు, సాయి,శ్రీశైలం,రఘు, మహిళలు, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 hour ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 hour ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 hour ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

13 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

16 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago