కేఎస్ ఆర్ కాలనీ అభివృద్ధి కోసం కృషి
కాలనీ నూతన అధ్యక్షుడు మైదం భాస్కర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కేఎస్ఆర్ కాలనీ అభివృద్ధి, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్లన్నట్లు కాలనీ నూతన అధ్యక్షులు మైదం భాస్కర్(ఎల్ఐసి)పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కె ఎస్ ఆర్ కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ను ఎన్నికల అధికారి సంగారెడ్డి కోర్టు అడ్వకేట్ డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మైదం భాస్కర్ (ఎల్ఐసి) కొనపాల భాస్కర్ ప్యానల్ మధ్య జరిగిన ఎన్నికల్లో మైదం భాస్కర్ ప్యానల్ గెలుపొందింది.అసోసియేషన్ అధ్యక్షులుగా మైదం భాస్కర్ ( ఎల్ఐసి), ప్రధాన కార్యదర్శిగా పావంత్స శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఈ మల్లికార్జున్ రావు, సంయుక్త కార్యదర్శిగా రూపక్ బైద్య, కోశాధికారిగా యన్మన్ గండ్ల ఆదిత్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మైదం భాస్కర్ మాట్లాడుతూ కేఎస్ఆర్ కాలనీ వాసులందరినీ కలుపుకొని సమస్యలను పరిష్కరిస్తూ కాలనీ అభివృద్దే ధ్యేయంగా అసోసియేషన్ నూతన కార్యవర్గం ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…