Telangana

పొంగిపొర్లుతున్న డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తా -బీఎస్సీపి నేత సుంకు వినయ్ కుమార్

_భారీవ‌ర్షాల‌తో అస్త‌వ్య‌స్తంగా మారిన జ‌న‌జీవ‌నం

మనవార్తలు ,రామచంద్రపురం :

భారీ వ‌ర్షాల కార‌ణంగా జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారింది. గ‌త వారం రోజులుగా ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల రోడ్లు ,డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో ఆయా కాల‌నీలు నీటిలో మునిగాయి .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని రామ‌చంద్రాపురం ఆర‌వ బ్లాక్ లో ఇళ్ళ ముందు మురికి నీరు పొంగి ప్ర‌వ‌హిస్తోంది. జీహెచ్ఎంసీ సిబ్బందికి ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోలేద‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులు బీఎస్పీ మ‌ద్ద‌తు కోర‌డంతో అక్క‌డికి వెళ్ళి స్థానికుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌కు శాశ్విత ప‌రిష్కారం చూపిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. బీహెచ్ఈఎల్ ఎంఏసీ సొసైటీ నుంచి ఈఎస్ఐ రామ‌చంద్రాపురం వెళ్ళే దారి, బీహెచ్ఈఎల్  రైల్వే స్టేషన్ వ‌ద్ద‌ చెత్త డంప్ యార్డ్ లాగా మారిపోయిందని బీఎస్సీపి ప‌టాన్ చెరు అసెంబ్లీ ప్రెసిడెంట్ సుంకు వినయ్ కుమార్ విమ‌ర్శించారు.

ఈ విష‌యంపై ప‌లు మార్లు స్థానిక కార్పోరేట‌ర్ దృష్టికి తీసుకువెళ్ళినా ప‌రిష్కారం కాలేద‌ని విమ‌ర్శించారు. స్థానిక ప్ర‌జ‌లు బీఎస్పీ మద్దతు కోరడంతో బీఎస్పీ నేత‌లు ఆ ప్రదేశాన్ని సందర్శించారు. రామ‌చంద్రాపురంలోని సమస్యలను రేపు రామచంద్రపురం జిహెచ్ఎంసి కమిషనర్ , జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళి వెంట‌నే ప‌రిష్కారించాల‌ని కోరుతామ‌న్నారు . ఈ కార్యక్రమం లొ బీఎస్సీపి పటాన్చెరు నియోజకవర్గం ఇంచార్జి సంజీవ , 111 డివిజన్ ప్రెసిడెంట్ పడమటి శ్రీశైలం , హెచ్ఐజి సెక్టార్ ప్రెసిడెంట్ శాంసన్ ,రామచంద్రపురం సెక్టార్ సెక్రటరీ రమేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago