రెండు కోట్ల 37 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో రెండు కోట్ల 37 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, అంతర్గత మురుగు నీటి కాలువలు, బోర్ వెల్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, రక్షిత మంచినీటి వసతులు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముత్తంగి డివిజన్ ను అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనుల కోసం దశలవారీగా నిధులు కేటాయిస్తూ నిర్దేశిత గడువుగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, ఇంజనీరింగ్ విభాగం డిఈ కృష్ణవేణి, ఏఈ ఫైజాన్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కిట్టు, మేరాజ్ ఖాన్, సందీప్, ఆబీద్, రామకృష్ణ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…