– మట్టి గణపతులను తయారుచేసి పర్యావరణ పరిరక్షణను చాటిచెప్పిన పాఠశాల విద్యార్థులు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
చిట్టి బుర్రలోని సృజనాత్మకతను వెలికితీస్తూ, చిన్నారి చేతులు మట్టి గణపయ్యలను రూపొందించాయి. పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ రుద్రారం ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎఎస్) విద్యార్థులు బుధవారం. ముట్టి గణపయ్యలను రూపొందించారు.హెదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష పర్యవేక్షణలో రసాయన శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ టీలీ పాత్రుడు, పర్యావరణ పాఠ్యాంశ బోధకులు డాక్టర్ ఆర్.ఉమాదేవి నేతృత్వంలో పలువురు బీఎస్సీ, ఈడబ్ల్యూబీ విద్యార్థులు పాఠశాల బాలబాలికలకు మట్టి గణపయ్యల రూపకల్పన పోటీలను పెట్టారు. దానికి అవసరమైన సానుగ్రినంతా సనుకూర్చి బాలల చిట్టి మెదళ్ళకు పదునుపెట్టి, వారిలో నిబిడీకృతంగా ఉన్న స్ప జనాత్మకతను వెలికితీశారు, బాలల్లో పర్యావరణ అవగాహన, సుస్థిరతను పెంపొందించడం ఈ పోటీ లక్ష్యం.ఈ పోటీలలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ అనుకూలత అనే ఇతివృత్తంతో విద్యార్థులు స్థిరమైన వస్తువులతో వినాయక విగ్రహాలను రూపొందించి తను సృజనాత్మకతన, నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించడం, దాని ప్రాముఖ్యత. గురించి విద్యార్థులు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడింది.చిన్నారులు రూపొందించిన విగ్రహాలను నిశితంగా పరిశీలించిన తరువాత విజేతలను ప్రకటించారు. విశిష్ట సృజనకు గాను వీరేందర్, దుర్గాప్రసాద్ కు ప్రథమ బహుమతి లభించింది. ద్వితీయ బహుమతిని మధుప్రియ, వెస్ట్లోని, నాగశ్రీ, దివ్యల బృందం గెలుచుకోగా, శ్రీమణి, వి.వెస్ట్లని జట్టు తృతీయ బహుమతిని దక్కించుకుంది. భార్గవ్, రాజ్కుమార్లు అసాధారణ ప్రతిభను చూసి ప్రత్యేక బహుమతులతో గుర్తింపు పొందారు. ఈ పోటీలలో పాల్గొన్న మిగిలిని విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి ఉత్సాహపరిచారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…