ఐదు రోజుల బూట్ క్యాంప్ ప్రారంభోత్సవంలో
సీ-డాక్ హైదరాబాద్ నిపుణుడు ప్రణయ్
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
మన దేశ సాంకేతిక, ఆర్థికాభివృద్ధిలో డ్రోన్ల ప్రాముఖ్యత పెరుగుతోందని, రక్షణ రంగంతో పాటు వ్యవసాయం, బట్వాడా (డెలివరీ), ఆరోగ్య సంరక్షణ, సర్వేలలో కూడా అవి కీలక భూమిక పోషిస్తున్నాయని సీ-డాక్ హైదరాబాదు ప్రాజెక్టు లీడర్ ఎం. ప్రణయ్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘అటానమస్ ఎయిర్ క్రాఫ్ఠ్ సిస్టమ్స్ & డ్రోన్ టెక్నాలజీస్’పై నిర్వహిస్తున్న ఐదు రోజుల (19 నుంచి 23వ తేదీ వరకు) బూట్ క్యాంపు ప్రారంభోత్సవంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు.మానవ రహిత ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ (యూఏఎస్) లేదా డ్రోన్, అనుబంధ సాంకేతికతలలో సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో MeitY’s స్వాయాన్ కార్యక్రమంలో భాగంగా ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా, అభివృద్ధి చెందుతున్న యూఏవీ సాంకేతికతలపై దృష్టి సారించిన సీ-డాక్ హైదరాబాదు, ఒక విస్తృతమైన ఆచరణాత్మక శిక్షణా కార్యక్రమాన్ని గీతంలో ఏర్పాటు చేసిందన్నారు.
ఈ ఐదు రోజుల కార్యక్రమ లక్ష్యాలు, డ్రోన్ల వర్గీకరణ, అందులోని భాగాలు, చేయదగిన, చేయకూడని పనులు, వాడే విధానాలు, వినియోగించే సాంకేతిక పరిజ్జానంతో పాటు డ్రోన్ టెక్నాలజీ యొక్క ఔచిత్యాన్ని విద్యార్థులకు ప్రణయ్ వివరించారు. స్వాయాన్ జాతీయ డ్రోన్ కార్యక్రమం, దాని కీలక ప్రయోజనాలు, కార్యకలాపాలు, అభ్యాస విధానం, శిక్షణ కార్యక్రమ వివరాలు, ఆశిస్తున్న ఫలితాలను ప్రణయ్ వివరించారు. ఆయనకు సీ-డాక్ ప్రాజెక్టు ఇంజనీరు టీ.ఏ.అశ్విన్, ప్రాజెక్టు అసోసియేట్ సి.మనీజలకు సహకరించారు.ఈ ఐదు రోజుల కార్యక్రమంలో డ్రోన్ సాంకేతికత, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనలు, డ్రోన్ డైనమిక్స్, సెన్సార్లు, విడిభాగాలు, నియంత్రణ, ఆచరణాత్మక వినియోగం, భద్రత, ప్రతిఘటనలు, డ్రోన్ అసెంబ్లింగ్, ఫ్లయింగ్, డ్రోన్ సిమ్యులేషన్ సాధానాల యొక్క ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీనిని విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను జారీచేస్తారు.
ఈ శిక్షణ ముగిసే సమయానికి, విద్యార్థులు డ్రోన్లపై ప్రధాన భావనాత్మక అవగాహన, ఆచరణాత్మక సాంకేతిక నైపుణ్యాలు, పరిశ్రమలో వినియోగం, నియంత్రణలపై లోతైన అవగాహన, ఇతరులతో పరిచయాలు, మంచి కెరీర్ ను ఎంచుకునేందుకు తోడ్పడడంతో పాటు ఆవిష్కరణ, వ్యవస్థాపకతకు దారితీసేలా ప్రేరేపిస్తున్నారు.తొలుత, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి వక్తలను స్వాగతించగా, నిర్వాహకురాలు డాక్టర్ డి. అనిత వారిని విద్యార్థులకు పరిచయం చేశారు. సహ-నిర్వాహకుడు డాక్టర్ సీహెచ్. ప్రవీణ్ కుమార్ ఈ క్యాంపును సమన్వయం చేస్తున్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ జెడ్పీటీసీ…
పటాన్‌చెరులో ఘనంగా ప్రారంభమైన 36వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువత…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో,…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…