సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో కొల్లూరు, ఉస్మాన్ నగర్, నాగులపల్లి ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి కేటాయించడం జరిగిందని గత కొంతకాలంగా అసాంఘిక శక్తులకు, మత్తు పదార్థాలకు కేంద్రాలుగా తయారవుతున్నాయని వెంటనే చర్యలు చేపట్టడంతో పాటు మత్తు పదార్థాల వినియోగం వల్ల వచ్చే అనర్ధాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డికి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.బుధవారం గచ్చిబౌలిలోని సిపి కార్యాలయంలో కమిషనర్ రమేష్ రెడ్డిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా నియోజకవర్గ పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల డివిజన్లలో గత కొంతకాలంగా మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా యువతతో పాటు విద్యార్థులు, పేద, మధ్యతరగతి ప్రజలు మత్తు పదార్థాలకు బానిసై.. అనారోగ్యానికి గురై ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో అత్యధిక శాతం అత్యంత నిరుపేదలు జీవనం కొనసాగిస్తున్నారని మత్తు పదార్థాల వినియోగం మూలంగా కుటుంబాలు రోడ్డున పడటంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో వెంటనే చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉత్పన్నమయ్య పరిస్థితి ఏర్పడబోతున్నాయని సిపి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సిపి రమేష్ రెడ్డి అతి త్వరలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రగ్స్ వాడకం మూలంగా ఎదురయ్యే పరిణామాలను ప్రజలకు స్వయంగా వివరించడం జరుగుతుందని తెలిపారు. నిరంతరం నిఘా పెట్టడంతో పాటు దుష్పరిణామాలపై వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…