Telangana

గణితంలో డాక్టర్ రామాంజనకు పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని రామాంజన కె. డాక్టరేట్ కు అర్హత సాధించారు. సాగే ఉపరితలాలపై పోరస్ మాధ్యమం ద్వారా కాసన్ ద్రవ ప్రవాహాలపై అయస్కాంత క్షేత్ర ప్రభావాలు అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం పూర్వ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.అరుణ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ రామాంజన పరిశోధన సజాతీయ పోరస్ మీడియాలో పొందుపరిచిన స్ట్రెచింగ్ షీట్లపై కాసన్ ఫ్లూయిడ్ ప్రవాహాల ప్రవర్తనపై దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ అధ్యయనం సోరెట్, డుఫోర్ ప్రభావాలు, ఉష్ణ వికిరణం, ఉష్ణ వనరులు, సింకులు, రసాయన ప్రతిచర్యలతో సహా వివిధ డైమెన్షన్ లెస్ పారామితులను నిశితంగా విశ్లేషించిందన్నారు. షూటింగ్ టెక్నిక్ తో కలిపి సారూప్య పరివర్తనలు, రంజ్-కుట్టా నాల్గవ-ఆర్డర్ పద్ధతిని ఉపయోగించి, ఆమె పని వేగం, ఉష్ణోగ్రత, ఏకాగ్రత ప్రొఫైళ్లపై భౌతిక పారామితుల ప్రభావంపై విలువైన ఫలితాలను అందించినట్టు వివరించారు.డాక్టర్ రామాంజన సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ రామాంజన సాధించిన విజయం ఎంతో గర్వంగా ఉందని, విద్యా, పరిశోధన ప్రయత్నాలలో ఆమె నిరంతర విజయం సాధించాలని వారు అభిలషించినట్టు తెలియజేశారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago