మనవార్తలు , పటాన్ చెరు:
భారత రాజ్యాంగ నిర్మాత, అభ్యుదయవాది, అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి అనుసరణీయమని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకొని రుద్రారం గ్రామం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సాబాదా సాయి కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా స్వాతంత్రం అనంతరం దేశంలో అత్యధిక శాతం కలిగిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను పొందుపరిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆరాధ్య దైవంగా అంబేద్కర్ మారారని అన్నారు.అంబేద్కర్ అంటే ఒక వర్గానికి పరిమితం కాదని, అన్ని వర్గాలకు స్ఫూర్తి ప్రదాత అని బడుగు, బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేడ్కర్.వారి అభ్యున్నతకి రాజ్యాంగంలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.
దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడుని స్మరించుకుంటూ జై భీమ్ నినాదాలు మారుమోగాయి. అంటరానితనం, సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి కుల, మత, వర్ణ, వర్గ రహిత సమాజం కోసం అహర్ణిశలు కృషి చేసిన మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాంగాన్ని క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి అన్నదానం మరియు అంబేద్కర్ శోభయాత్ర కు గాని మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్ గారికి అంబేద్కర్ యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎమ్అర్ పిఎస్ ,ఎమ్ఇఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ ముక్క గళ్ళ ఆంజనేయులు ,బీఎస్పీ సెక్టార్ ఇంచార్జి సాబాదా శ్రీనివాస్,రాష్ట్రీయ దళిత సేన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్,సంఘం అధ్యక్షులు, మహేష్ మాజీ వార్డు మెంబర్ పోట్లచెరువు ప్రభు ఎర్రోళ్ల ప్రభు, పెద్దబోదుల నర్సింలు, గడ్డమీది కుమార్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…