అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య

politics Telangana

రేషన్ షాపులలో 14 రకాల వస్తువులను ఇవ్వాలి

రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలిసిపిఎం ఆధ్వర్యంలో

తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా 

ప్రజావాణిలో వినతి పత్రం అందజేత

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్ చెరు నియోజకవర్గం లో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం మండల ప్రజా వానిలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య మాట్లాడుతూ అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని ,రేషన్ షాప్లలో 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పటాన్ చెరు నియోజకవర్గంలోని, పటాన్ చెరు ,రామచంద్రాపురం, బీరంగూడ ,అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాలలో వేలాది మంది ప్రజానికం సొంత ఇండ్లు లేకపోవడంతో, అద్దె ఇండ్లలో ఉంటూ జీవనం సాగిస్తు ప్రతినెల 8000 రూపాయల నుండి 12 ,15 వేల రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నారన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఇళ్ల సముదాయాలను కొల్లూరు, అమీన్పూర్, బీరంగూడ, ముత్తంగి, నాగులపల్లి, కర్దనూర్, పోచారం, బచ్చుగూడ, చిట్కుల్, కొడకంచి అనేక ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని ఇండ్ల సముదాయాన్ని నిర్మించిందని గుర్తు చేశారు.

కానీ ఇందులో అనేక ప్రాంతాలలో ఇప్పటికీ పూర్తిగా నిర్మాణం చేయకుండా, నిర్మాణం మధ్యలోనే ఆపివేశారని ఆరోపించారు. నిర్మాణాలు పూర్తి చేయని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలని, ఇప్పటికే పటాన్ చెరు, రామచంద్రాపురం, బీరంగూడ ప్రాంతాలలో వేలాదిమంది దరఖాస్తులు చేసుకున్న లిస్టులలో పేర్లు ఉన్నా కాని సంబంధిత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నేటికీ ఇండ్లను ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు.సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులను సిఎంసి ఆఫీస్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం చుట్టూ అధికారులు తిప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి నిర్మాణాన్ని చేసి, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు,

అనేకమంది ఇందిరమ్మ ఇండ్లు సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకున్న వారికి దఫాలుగా రావాల్సిన ఇంటి నిర్మాణ బిల్లులు నేటికీ చెల్లించకుండా లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ టవర్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని పటాన్ చెరు నియోజకవర్గంలో విధివిధానాలను ప్రకటించాలని, లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్య పరిష్కారం కానిపక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు, ఏరియా కమిటీ సభ్యులు ఎండి వాజిద్ అలీ, పి పాండురంగారెడ్డి, సిపిఎం నాయకులు చంద్ర కిరణ్ సింగ్, లఖాన్,సదాశివరెడ్డి, సురేందర్, జయరాం, మార్క్స్ నగర్ అర్జున్, సంతోష్, ఇమ్మానియేల్ బాబు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *