Telangana

శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం

బి.ఆర్.ఎస్ పార్టీ నాయకుడు పృథ్వీరాజ్  

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్నటువంటి శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, ఎం.డి.ఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్ లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. దేవాలయ అధ్యక్షుడు రఘు, మాజీ వార్డ్ మెంబర్ యాదగిరి మరియు గ్రామస్తులు సమక్షంలో ఈ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ భక్తుల ఆధ్యాత్మిక శ్రద్ధను ప్రోత్సహించేలా అన్ని మతాల దేవాలయాల అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. గత మూడు తరాలుగా మా కుటుంబం పేదల అభ్యున్నతికి అంకితభావంతో సేవలందిస్తోంది. ఇళ్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను మా కుటుంబం చేపట్టి ప్రజల సంక్షేమానికి పాటుపడుతోంది. ఇప్పుడు నేనూ మా కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, పటాన్‌చెరు పెద్దల సహకారంతో మరింత సమగ్రంగా ముందుకు సాగుతాను. భవిష్యత్తులో ప్రజలు ఆశించే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని పృథ్వీరాజ్ అన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

16 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago