_ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజమని, ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా కల్పించిన ప్రోటోకాల్ హక్కును సైతం ఉల్లంఘిస్తూ ఎలాంటి రాజ్యాంగ పదవులు లేని అధికార పార్టీ నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, దీని మూలంగా రాజకీయ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నాయని..ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను ఆయన డిజిపి దృష్టికి తీసుకువచ్చారు. అధికారిక కార్యక్రమాల పర్యటనలో పోలీస్ ఎస్కార్ట్ ను తొలగించడం అధికార పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి.. ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్ కు విరుద్ధంగా పాల్గొనడం ,తదితర చర్యల మూలంగా నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయన ఫిర్యాదు చేశారు.వెంటనే పై అంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావులు పాల్గొన్నారు.
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…