శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని బీజేపీ నేతలు అన్నారు. సోమవారం రోజు హఫీజ్ పేట్ లో హఫీజ్ పేట్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా హఫీజ్ పెట్ లోని ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు భోజన సదుపాయం మరియు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ, మరియు మియాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు లు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తనపుట్టిన రోజునాడు ఇలాoటి సేవాకార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిని మహేష్ యాదవ్, దేవాల్ యాదవ్, రామిశెట్టి రావు, సురేష్ యాదవ్, సైఫుల్ల ఖాన్, సలీం, శ్రీనివాస్ యాదవ్, రవి ముదిరాజు, అశోక్ నాయి, వినాయక రెడ్డి, సుబ్బారావు, నవీన్, రఘు, దినేష్, జానీ, శ్రీనివాస్, సురేఖ, స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్ళు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.