– దేశాభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలి – ప్రభాకర్ యాదవ్
మనవార్తలు ప్రతినిధి- శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్‌లోని జడ్పీహెచ్‌ఎస్ హై స్కూల్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేసి, ఆరోగ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యతలను పెంపొందించేలా దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని జాతీయ జెండాలను చేతబూని దేశభక్తిని చాటారు..ఈ సందర్భంగా ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ “స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలనీ. యువత దేశ భవిష్యత్తుకు పునాదులనీ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత రాధాక్రిష్ణ యాదవ్, పాఠశాల హెడ్ మాస్టర్ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు రాజశేఖర్ రావు, మధుసూధన్ రెడ్డి, నరోత్తమ రెడ్డి, రమేష్, అనిల్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, మoగ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

