నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు మంజూరైన 16 లక్షల 50 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కరోనా మూలంగా తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలులో ఎక్కడ వెనుకంజ వేయలేదని అన్నారు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్న ట్లు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ అంజయ్య, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, రాజేష్, మల్లేష్, ఉమేష్, సత్తయ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…