Districts

దుర్గమ్మకు కానుకగా డైమండ్‌ నెక్లెస్‌

మనవార్తలు ,విజయవాడ:

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన భక్తుడు బి.పూర్ణచంద్రుడు రూ.2.50 లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ను  కానుకగా అందజేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన పూర్ణచంద్రుడు దంపతులు ఆలయ పర్యవేక్షకులు బలరామ్‌ను కలిసి నెక్లెస్‌ను అందజేశారు.సుమారు 17 గ్రాముల బంగారం, చిన్న డైమండ్స్‌తో రూపొందించిన ఈ నెక్లెస్‌ను ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించాలని దాతలు కోరారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దాతలతోపాటు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి తదితరులున్నారు.

admin

Recent Posts

రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి

సంగారెడ్డి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: రాష్ట్రస్థాయి కబడ్డీ…

8 hours ago

వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ 15 ఏళ్ల ప్రస్థానం

5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు…

12 hours ago

డీజెఎఫ్ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

13 hours ago

వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…

15 hours ago

సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…

16 hours ago

ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)…

16 hours ago