మనవార్తలు ,పటాన్చెరు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు కార్పొరేటర్ గా మెట్టు కుమార్ యాదవ్ ఎన్నికై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్ల పరిధిలో ప్రజలు ఎంతో నమ్మకం తో తెరాస పార్టీ అభ్యర్థులను బంపర్ మెజార్టీ తో ప్రజలు గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.
రాబోయే రోజుల్లో సీఎం కెసిఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కే టి ఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ల సహాయ సహకారాలతో మూడు డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ దేవానంద్, మాజీ ఎంపీపీ లు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, స్తానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…