AMEENPUR.jpg
సమిష్టి సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలో గల యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు చేపడుతున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పూర్తయితే సుమారు 10 కాలనీల ప్రజలకు మెరుగైన రహదారి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలో వెలుస్తున్న నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్ పి టి సి సుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, శ్రీకాంత్, జ్ఞానేశ్వర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…