Telangana

గీతమ్ ఉల్లాసంగా దాండియా , బతుకమ్మ వేడుకలు…

మనవార్తలు ,పటాన్ చెరు:

సృజనాత్మక వేడుకలు ఒత్తిడిని అధిగమించేలా చేస్తాయని , సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తాయని , అంతిమంగా ఉజ్వల భవతకు బాటలు వేస్తాయని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని అన్వేషణ , కళాకృతి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ‘ ధోల్ – ఎ – జర్న్ ‘ పేరిట శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు . విభిన్న సాంస్కృతిక , ఉత్సాహ పూరిత అంశాల మేళవింపుతో రూపకల్పన చేసిన ఈ ఒక రోజు కార్యక్రమాన్ని ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్యలు లాంఛనంగా ప్రారంభించారు .

రోజువారీ కార్యకలాపాలకు భిన్నంగా నిర్వహించే ఇటువంటి సాంస్కృతిక పోటీలలో పాల్గొనడం వల్ల ఒక రకమైన సుహృద్భావ వాతావరణం వెల్లివిరుస్తుందని , కొత్త అనుబంధాలకు దారితీస్తుందని వారు అభిప్రాయపడ్డారు . విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న నెపుణ్యాలు వెలికితీసే వేదికలుగా సాంస్కృతికోత్సవాలు తోడ్పడతాయని , మెత్రీభావవను పెంపొందించి , బృందాలు కలిసి పనిచేసే సంస్కృతికి బాటలు వేస్తాయని డెరైక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లెఫ్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ అన్నారు .

ఈ ఒకరోజు వేడుకలలో భాగంగా దాండియా , బతుకమ్మ , పలు సాంస్కృతిక కార్యక్రమాలు , ఫుడ్ స్టాళ్లు , ఫోటోబూత్లు వంటి పలు ఆకట్టుకునే అంశాలను అన్వేషణ , కళాకృతి విద్యార్థులు నిర్వహించారు . గీతం విద్యార్థులంతా ఎంతో ఉత్సాహభరింతగా వాటిలో పాల్గొని తమలో దాగివున్న ప్రతిభను చాటారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago