_హెచ్ సి ఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు వినతి
మనవార్తలు ,పటాన్ చెరు:
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పటాన్ చెరుపట్టణానికి చెందిన మైత్రి క్రికెట్ క్లబ్ కు సభ్యత్వం అందించేందుకు సహకరించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం హెచ్ సీ ఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహారుద్దీన్ ను కోరారు. గతంలో పటాన్ చెరు పరిధిలోని ఇక్రిసాట్ టీంకు హెచ్ సి ఏ సభ్యత్వం కలిగి ఉండేదని, చాలా రోజులుగా పోటీల్లో పాల్గొనలేకపోవడంతో వారి స్థానంలో మైత్రి క్రికెట్ క్లబ్ కు అవకాశం ఇవ్వాలని కోరగా, అందుకు యాజమాన్యం అంగీకరించిందని అజారుద్దీన్ కు తెలిపారు.రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించిన మేరకు అజారుద్దీన్ కలవడం జరిగిందని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఉమ్మడి మెదక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…