మనవార్తలు ,పటాన్ చెరు:
రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వచ్చే నెల 6, 7 తేదీలలో పటాన్చెరువు పట్టణంలో నియోజకవర్గస్థాయి మహిళల క్రీడా పోటీలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం క్రీడా పోటీలు నిర్వహించనున్న మైత్రి క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగినులు, మహిళా ప్రజాప్రతినిధులు కోసం క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 8వ తేదీన జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో మహిళా దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
భారీ స్థాయిలో నిర్వహించనున్న కార్యక్రమాలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ సతీమణి మెట్టు రమాదేవి కుమార్ యాదవ్, గూడెం కల్పనా మధుసూదన్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఎంఈఓ రాథోడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…