పటాన్ చెరు:
నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ పాత్రికేయ మిత్రుడు, వార్త విలేకరి స్వర్గీయ ప్రవీణ్ గౌడ్ మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటని పటాన్ చేరు నియోజకవర్గ జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటివల ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన స్వర్గీయ ప్రవీణ్ గౌడ్ కు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, పటాన్ చేరు నియోజకవర్గ జర్నలిస్టులు కలిసి పటాన్ చేరు యంపిపి కార్యాలయం వద్ద ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగ పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ… పత్రికారంగంలో ఒత్తిడులను భరించలేని స్థితిలో ఆర్ధిక ఇబ్బందులతో ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడం విచారకమన్నారు.సమాజానికి ఎన్నో విధాలా సందేశం ఇచ్చే విలేకరులు ఇలా అధైర్యానికి లోను కాకుండా ప్రతి సమస్యను ఎదుర్కొని ధైర్యంగ ఎదురుకోవాలని, ప్రవీణ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, జర్నలిస్టులు ఆత్మస్థైర్యం తో ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పటాన్ చేరు జర్నలిస్టులు మిత్రులు యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, మోటూరి నారాయణ రావు, చంద్రశేఖర్, నర్సింహ్మచారి, రాజు, బశ్వేశ్వర్ , ఆంజనేయులు, నగేష్ చారి, నరేష్, రాజు,బుక్క శ్రీనివాస్, సంగమేశ్, సతీష్, శివ, సంజీవ, రాము, దశరధ్,తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : బీసీ రిజర్వేషన్ బిల్లు తెరపైకి తేవడం కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన కుట్ర అని మాజీ…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్‌చెరు శాసన…
పటాన్‌చెరులో ఘనంగా మిస్సైల్ మాన్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అత్యంత సామాన్య కుటుంబం…
పటాన్చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…
ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయి…
గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు పటాన్‌చెరు…