Telangana

ప్రజాధనాన్ని దోచుకున్న వారిని కాంగ్రెస్ వదిలిపెట్టదు_మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి మెదక్ పార్లమెంట్ ఇంచార్జీ కొండా సురేఖ పిలుపు నిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను బలపరుస్తూ కాంగ్రెస్ శ్రేణులతో మీడియా సమావేశం నిర్వహించారు.అనంతరం కొండ సురేఖ మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు స్థానం ప్రత్యేకమైనదని, ఈ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోనే మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ ఉందని అలాగే, ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు నియోజకవర్గం కూడా ఉందని , ఈ సెగ్మెంట్ ను కాంగ్రెస్ పార్టీ సవాల్ గా తీసుకొని ముందుకు వెళుతుందని ఇందుకోసం నియోజకవర్గ ఇంచార్జ్ లు నాయకులు కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా భారీ అవినీతి, అక్రమాలకు తెర లేపడమే కాకుండా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని .కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, టిఆర్ఎస్ కుటుంబం లాభ పడిందని అన్నారు.

ప్రస్తుతానికి పొలం బాట పట్టిన మాజీ సీఎం కేసీఆర్, ఆనాడు కొండగట్టు లో జరిగిన బస్సు ప్రమాద ఘటన స్థలానికి వెళ్లి పరామర్శించిన వారిలో కెసిఆర్ కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో ? చెప్పాలని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఒక మహిళకు కూడా క్యాబినెట్లో చోటు ఇవ్వలేదన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ కు ఓ బానిస, ఆయనకు ప్రజల్లో గుర్తింపు లేదన్నారు. మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు పార్లమెంటు ఎన్నికల్లో ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ బయటకు వచ్చాడని విమర్శించారు.

ఇకపోతే బిజేపి అభ్యర్థి రఘునందన్ మాటల మనిషే గాని చేతల మనిషి కాదని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలుతో. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం వచ్చిందన్నారు. మెదక్ పార్లమెంట్ స్ధానాన్ని బిఆర్ఎస్, బిజేపిలు కైవసం చేసుకునేందుకు డబ్బుల వలవేసి ఓటర్ల ను ప్రలోభాలకు గురి చేస్తున్నాయన్నారు.మెదక్ జిల్లా ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుని, సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతలు నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాటా సుధా, నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ నర్సిరెడ్డి,మెదక్ రోహిత్, సిద్దిపేట్ పూజల హరికృష్ణ, డిసిసి ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, మండల కాంగ్రెస్, పట్టణ నేతలు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గణితంలో ఆదుర్తి శ్రీవల్లికి పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…

17 hours ago

ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంగోలి, కైట్ ఫెస్టివల్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

3 days ago

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద_ గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…

5 days ago

యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…

5 days ago

విశ్వగురు స్వామి వివేకానంద

దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…

5 days ago

క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే జిఎంఆర్

జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

5 days ago