విద్యార్థులు మృతి చెందిన ఘటనలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం నింపిన ఆరుగురు విద్యార్థుల మృతి
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
వినాయక నిమర్జనంలో విద్యార్థులు మృతి చెందిన ఘటనలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల శిరీష చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ తమ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో నెలకొల్పిన వినాయకుని నిమజ్జనం కోసం విద్యార్థులు శివారులో గల నేరేడు చెరువులో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం వారి కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు.ప్రమాద ప్రాంతంలో లోతైన గుంతలు, తగిన వెలుతురు వంటి భద్రతా లోపాలపై అధికారులు సమగ్రంగా విచారణ జరపాలని,విద్యార్థుల మృతితో ఆరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయని, వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ₹30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో అర్హత ఉన్న ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని,బాధిత కుటుంబాలకు అవసరమైన విద్య, వైద్య మరియు ఇతర ప్రభుత్వ సహాయాన్ని అందించాలని,ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చెరువులు, కుంటల్లో నిమజ్జన కార్యక్రమాలకు ముందుగా లోతైన ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు, తగిన వెలుతురు, రక్షణ సిబ్బంది, రెస్క్యూ ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులు, యువత పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.విద్యార్థుల ప్రాణాలకు విలువనిచ్చి, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెందిన విద్యార్థులకు పటాన్‌చెరు డివిజన్ కమిటీ ఘన నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…