Telangana

నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసిన మహోన్నత నాయకులు సీఎం కేసీఆర్

_నేడే రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పండుగ

_లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం

_కొల్లూరులో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ ఏర్పాట్లు పూర్తి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

అగ్గిపెట్ట లాంటి అద్దె ఇల్లు… చాలీచాలని జీతాలతో జీవితం వెళ్లదీస్తున్న నిరుపేద ప్రజలకు అత్యంత ఖరీదైన ప్రాంతంలో 50 లక్షల రూపాయల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి అందజేస్తున్న మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్ల పరిధిలో రెండో విడతలో ఎంపికైన 500 మంది లబ్ధిదారులతో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో అత్యంత ఆధునిక సాఫ్ట్వేర్ సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.రెండో విడతలో ఎంపికైన 500 మంది లబ్ధిదారులకు కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గురువారం లాటరీ పద్ధతిన బ్లాక్ లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఇళ్ల పత్రాలు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు పేర్కొన్నారు.పటాన్చెరుకు సంబంధించిన లబ్ధిదారులందరిని పటాన్చెరు క్యాంపు కార్యాలయం నుండి బస్సులు ఏర్పాటు చేసి కొల్లూరు కి తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago