Telangana

శాండ్విక్ పరిశ్రమలో సిఐటియు ఘన విజయం.

– ఈ విజయం సాండ్విక్ కార్మికులకు అంకితం

– కార్మికులు ఎర్రజెండా పక్షాన ఉన్నారన టానికి ఇదే నిదర్శనం

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమలో గురువారం కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు హెచ్ఎంఎస్ పై 106 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. పరిశ్రమలో మొత్తం 194 ఓట్లకు గాను 192 ఓట్లు పోలైనవి అందులో 149 ఓట్లు సిఐటియు కు 43 ఓట్లు హెచ్ ఎం ఎస్ కు రావడం జరిగింది.ఈ సందర్భంగా కార్మికులు పరిశ్రమ ముందు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ ఈరోజు జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో చుక్క గుర్తుకు ఓటు వేసి 106 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించిన కార్మికులందరికీ విప్లవ జేజేలు అభినందనలు తెలిపారు. శాండ్విక్ పరిశ్రమ కార్మిక వర్గానికి రాష్ట్రంలో పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో ఒక మంచి గుర్తింపు ఉందని రాష్ట్రములోనే ఒక ఆదర్శ యూనియన్ గా చారిత్రాత్మక వేతన ఒప్పందాలతో కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం సిఐటియు పనిచేస్తుందని కానీ కొంతమంది యాజమాన్యంతో కుమ్మక్కై పోటీ యూనియన్ ని స్థాపించారని వారి ఎత్తుగడ లు, మోసపూరిత మాటలను కార్మికులు నమ్మకుండా భారీ మెజార్టీతో గెలిపించారని వారందరికీ భవిష్యత్తులో జరిగే వేతన ఒప్పందాలలో యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి మరిన్ని చారిత్రాత్మకమైన ఒప్పందాలు సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. ఈ విజయం ప్రత్యర్థులకు ఒక గుణపాఠం కావాలని, వారి ఆరోపణలు అవాస్తవమని కార్మికులు గుర్తించారని, కార్మికులు ఎర్రజెండా పక్షాన ఉన్నారన్నటానికి ఇదే నిదర్శనమన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు మల్లేశం, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి, సిఐటియు జిల్లా నాయకత్వం సాయిలు, నరసింహారెడ్డి, రాజయ్య ,వాజిద్ అలీ, యూనియన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ వివిధ పరిశ్రమల సిఐటియు కార్మిక నాయకులు, కార్మికులు సాండ్విక్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago