మనవార్తలు ,పటాన్ చెరు
నేటి దాత్రి: చదువుల తల్లి సరస్వతి అనుగ్రహంతో విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన లక్ష్మణ్ తన పుట్టినరోజును పురస్కరించుకొని సొంత నిధులతో పెద్దకంజర్ల ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహాన్ని నిర్మించారు. సోమవారం పెద్దకంజర్ల ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహాన్ని నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన లక్ష్మణ్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలు దేవాలయాలతో సమానమని, అలాంటి దేవాలయంలో సరస్వతి దేవి విగ్రహాలను ప్రతిష్టించడం మంచి సంప్రదాయమన్నారు.
సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు మంచి నడవడికతో విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన అభిలాషించారు. విద్యతో సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమని నమ్మి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ మన ఊరు మనబడి ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చి వేస్తుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజ్ కుమార్, ఉప సర్పంచ్ హరీశంకర్ గౌడ్, వార్డు సభ్యులు నరేష్ రెడ్డి, మల్లేష్, చిత్తారి, సరోజనమ్మ, నర్సమ్మ, మనోహరమ్మ, భాస్కర్, ఇమ్రాన్, నాగభూషణం, ముత్యాలు, సతీష్, నిరంజన్, రాజు, బలరామ్, రమేష్, గ్రామ పెద్దలు, ప్రజలు, పెద్ద కంజర్ల ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…