మనవార్తలు ,బొల్లారం:
భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ లాభసాటిగా ఉంటోందని, ప్లాట్లు కొన్ని నెలల వ్యవధిలోనే అమ్ముడైతాయని తెరాసా సీనియర్ నాయకులు, బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ లోని బీ.సీ కాలనీ లో మైత్రి కన్స్ట్రక్షన్స్ చెందిన రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని చంద్రారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందే ప్రాంతాల్లో వెంచర్‌లు కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతారన్నారు. అంతే కాకుండా వెంచర్లలో రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ మౌలిక వసతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మంచి లక్ష్యంతో కొనసాగుతున్న మైత్రి కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ లాభాలతో ముందుకు సాగాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాలమ్మ , కొండ రెడ్డి , మల్లిఖార్జున్ రెడ్డి , అనిల్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి , రాజ్ గోపాల్ (బొల్లారం మున్సిపల్ తెరాసా ఉపాధ్యక్షులు), చంద్రారెడ్డి , దిననాధ్ , చక్రపాణి (బొల్లారం మున్సిపల్ తెరాసా బి.సి.సెల్ అధ్యక్షులు), వెంకటయ్య , నవీన్ రెడ్డి , సంజీవ్ , సత్యనారాయణ , చిన్నా , దిగంబర్ , వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…