Districts

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరలను తగ్గించాలి _- ఎపిఆర్ గ్రూప్ చైర్మన్ కృష్ణారెడ్డి

మనవార్తలు ,పటాన్‌చెరు:

ధరల పెరుగుదలతో నిర్మాణ రంగం కుదేలైందని ఎపిఆర్ గ్రూప్ చైర్మన్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగానికి గుదిబండగా మారిన పెట్రోల్, డీజిల్, సిమెంట్, స్టీల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎపిఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు శివారులోని ఎపిఆర్ సంస్థ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధరలను తగ్గించకపోతే లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ఎప్పుడు ఏ విధంగా ధరలు పెరుగుతాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు గృహ నిర్మాణాలు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధరల పెరుగుదలతో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరలను నియంత్రించాలని తెలిపారు. లేని పక్షంలో ఒకరోజు నిరసన ప్రదర్శనతో ఆగకుండా నెల రోజులైనా పనులు ఆపి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎపిఆర్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

15 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

16 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago