Telangana

ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన సెంట్రింగ్ యూనియన్ నాయకులు

_ప్రతిపక్షాలు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే

_ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి ఏకగ్రీవాల మద్దతు పరంపర కొనసాగుతూనే ఉంది.అమీన్పూర్ మండల పరిధిలోని సెంట్రింగ్ యూనియన్ నాయకులు, సభ్యులు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఏకగ్రీవ మద్దతు పలికారు.ఈ మేరకు మంగళవారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుమారు సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు నాగేంద్ర ఆధ్వర్యంలో సుమారు 300 మంది సెంట్రింగ్ యూనియన్ సభ్యులు బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే జీఎంఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను 10 సంవత్సరాల కాలంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాలంటే అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు.

ప్రధానంగా అసంఘటిత రంగ కార్మిక రంగానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఎన్నికల అనంతరం సెంట్రింగ్ కార్మికులకు ఆత్మగౌరభవనం నిర్మించడంతోపాటు అన్ని సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ఐదేళ్ల కాలంలో ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు నేడు ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కారుస్తూ అమలుకు సాధ్యం కానీ హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం,మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్స్ సభ్యులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

11 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

11 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

11 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

23 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago