అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలి

యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలం రామేశ్వరంబండ గ్రామ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో గ్రామ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు […]

Continue Reading

ఐక్యత, సమైక్యతా స్ఫూర్తిని కొనసాగించండి

క్యాడెట్లకు కల్నల్ రమేష్ సరియాల్ సూచన విజయవంతంగా ముగిసిన ఎన్ సీసీ శిబిరం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎన్ సీసీ క్యాడెట్లంతా ఐక్యత, క్రమశిక్షణతో మెలగాలని, సమైక్యతా స్ఫూర్తిని కలకాలం కొనసాగించాలని సంగారెడ్డిలోని 33 (టీ) బెలాలియన్ ఎన్ సీసీ క్యాంప్ కమాండెంట్, కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేష్ సరియాల్ సూచించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గత పదిరోజులుగా నిర్వహిస్తున్న శిబిరం ముగింపు సమావేశంలో ఆయన క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ శిబిరం క్యాడెట్లను నిజంగా […]

Continue Reading

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దశాబ్దాల కాలపు ప్రజల పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటని, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం.. తోడ్పాటుతో పటాన్చెరు నియోజకవర్గాన్ని. అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు..తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయం, మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ జెండా ఆవిష్కరణల కార్యక్రమానికి […]

Continue Reading

మిస్ తెలుగు యూఎస్ఏ పోటీలో మెరిసిన గీతం పూర్వ విద్యార్థిని

మిస్ తెలుగు యూఎస్ఏ రన్నరప్ కిరీటం, పీపుల్స్ ఛాయిస్ అవార్డులు కైవసం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని చూర్ణికా ప్రియ కొత్తపల్లి మిస్ తెలుగు యూఎస్ఏ 2025 పోటీలో రెండు ప్రతిష్టాత్మక టైటిళ్లను సాధించినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించిన చూర్ణిక, ప్రస్తుతం అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నారని, గీతంలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-2024) […]

Continue Reading

60 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదులు

ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 60 లక్షల రూపాయల నిధులతో నాలుగు అదనపు తరగతి గదులు నిర్మించబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ముత్తంగి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో గల గదులు శిథిలావస్థకు చేరుకోవడం […]

Continue Reading

రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా రుద్రారం జిల్లా పరిషత్ పాఠశాల

16 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నూతన భవనం , మౌలిక వసతులు  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు  కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత విద్య  పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోనే రుద్రారం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను 16 కోట్ల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దబోతున్నట్లు […]

Continue Reading

సామూహిక స్ఫూర్తిని నింపిన ముదిత 3.0

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రదానం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం వార్షిక ఆనందం, శ్రేయస్సుల వేడుక ‘ముదిత 3.0’ సామూహిక స్ఫూర్తిని చాటింది. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ ఆతిథ్య విభాగం బుధవారం ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, సహాయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన, దీర్ఘకాలిక సేవ, గుర్తింపుకు నోచుకోని వారి సేవలను గుర్తించి, వెలుగులోకి తెచ్చి, వారిని అవార్డులతో సత్కరించడంతో […]

Continue Reading

నేటి తరం యువతకు ఆదర్శం రమేష్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

కంటి చూపు లేకపోయినా డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ కోర్సులు పూర్తి దివ్యాంగుడి కోటాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లుతోపాటు,పెన్షన్ అందించిన ఎమ్మెల్యే జీఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కంటి చూపు లేకపోయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా మొక్కవోని దీక్షతో గ్రాడ్యుయేషన్ తో పాటు మూడు కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసిన దివ్యాంగుడు రమేష్ జీవితం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్‌చెరు పట్టణానికి చెందిన రమేష్ తొమ్మిదవ […]

Continue Reading

ఎన్ సీసీ శిబిరాన్ని ప్రారంభించిన కల్నల్ రమేష్ సరియాల్

క్రమశిక్షణతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని క్యాడెట్లకు సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డిలోని 33 (తెలంగాణ) బెటాలియన్ ఎన్ సీసీ క్యాడెట్ల కోసం నిర్వహిస్తున్న సంయుక్త వార్షిక శిక్షణా శిబిరాన్ని (సీఏటీసీ-III) కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేష్ సరియాల్ మంగళవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (రుద్రారం) ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడుతూ, దీని నిర్వహణ కోసం మంచి వసతులను కల్పించడమే గాక, అద్భుతమైన ఏర్పాట్లు చేసిన […]

Continue Reading

వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో హీరోయిన్ ధ‌న్య బాల‌కృష్ణ‌ సందడి

▪️ శరత్ సిటీ మాల్‌లో క‌ల‌ర్‌ఫుల్ ఈవెంట్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్  కొండాపూర్‌ లో వింధ్య గోల్డ్  – సిల్వర్ బార్ ఛాలెంజ్‌ ఈవెంట్‌కు హీరోయిన్ ధ‌న్యబాల‌కృష్ణ‌ హాజరై సందడి చేశారు.ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ, “వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ ఒక బంగారు భరోసా లాంటిది. నాణ్యమైన ఆభరణాలతో పాటు ఈ ఛాలెంజ్ వంటి ఆకర్షణీయ కార్యక్రమాలు కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని […]

Continue Reading