మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో గలకొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బీ బ్లాక్ కి చెందిన శ్రీమతి పద్మ గౌడ్ గారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా దాని ద్వారా మంజూరైన 51 వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి పి ఎ సి. చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రిలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సాయంని అందిస్తుందని దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో వందలాది కుటుంబాలను సి ఎం ఎఫ్ ద్వారా ఆదుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా గణేష్, ప్రసాద్ ,సత్యం గౌడ్,యాదగిరి రెడ్డి, రవి శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…